English | Telugu
నయన మాట్లాడితే పుకారే...!
Updated : Dec 2, 2013
నయనతార ప్రేమాయణం మొదలై, అవి ముగిసిపోయిన కూడా... అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. "రాజా-రాణి" చిత్రంతో కోలీవుడ్ లో మళ్ళీ టాప్ వన్ హీరోయిన్ స్థానాన్ని సొంతం చేసుకొని, వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మది జీవితంలో మాత్రం పుకార్లు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా... నయనతార, ఉదయనిధి స్టాలిన్ జంటగా "ఇదు కదిర్ వేలన్ కాదల్" అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మీడియా సమావేశంలో స్టాలిన్ గురించి నయనతార మంచిగా మాట్లాడటంతో వీరిద్దరి మధ్య ఎదో ఉందని పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లకు విసుగెత్తిపోయిన నయన చాలా బాధపడుతుందట. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కంటే... మీడియాలో వచ్చిన కథనాలే నన్ను ఎక్కువగా భాదిస్తున్నాయి. సాటి నటుడి గురించి కాస్త మంచి మాటలు చెప్పినా కూడా తప్పేనా? అంటూ నయన భాధపడుతుంది.