English | Telugu

డిసెంబర్ 11 న రవితేజ హన్సిక

రవితేజ హీరోగా "బలుపు" సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఇందులో రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటించనుంది. రవితో కలిసి నటించడం హన్సికకు ఇదే తొలిచిత్రం. అందుకే వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే విధంగా ఉండాలని దర్శకుడు బాబీ ప్రయత్నిస్తున్నాడట. మరి అసలే మాస్ రాజ అమ్మాయిలను ఆట పట్టించడంలో చాలా స్పీడు. రవితేజ మరి ఈ సినిమాలో హన్సికను ఎలా ఆడుకుంటాడో, తనతో ఎలా రొమాన్స్ చేస్తాడో అనేది అతి త్వరలోనే తెలియనుంది. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 11 నుండి ప్రారంభం కానుంది. త్వరలోనే మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేయనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.