English | Telugu

ఈవారం థియేటర్స్‌లో, ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!

ప్రేక్షకులకు సినిమా దాహాన్ని తీర్చేందుకు ఇప్పుడు థియేటర్లతోపాటు అనేకా ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ఓటీటీలలో నచ్చిన జోనర్‌లో నచ్చిన సినిమా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. థియేటర్లలో వచ్చే సినిమాల కోసమే కాదు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే సినిమాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవారం థియేటర్లలో, ఓటీటీల్లో రిలీజ్‌ అవుతున్న సినిమాలు ఏమిటో చూద్దాం.

థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు:

మిత్రమండలి
ప్రియదర్శి, నిహారిక ఎన్‌.ఎమ్‌ ప్రధాన పాత్రల్లో ‘మిత్రమండలి’ విడుదలవుతోంది. ఎస్‌.విజయేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనెల 16న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా ప్రధాన తారాగణంగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తెలుసు కదా’. ఈనెల 17న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.

డ్యూడ్‌
ప్రదీప్‌ రంగనాథన్‌, మమిత బైజు జంటగా రూపొందిన సినిమా ‘డ్యూడ్‌’. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 17న తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది.

కె-ర్యాంప్‌
కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన లవ్‌ ఎంటర్టఐనర్‌ కె ర్యాంప్‌. జేమ్స్‌ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది.

ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమాలు:

నెట్‌ ఫ్లిక్స్‌:
ఎవ్రిబడీ లవ్స్‌మి వెన్‌ ఐ యామ్‌ డెడ్‌.. అక్టోబర్‌ 14
ఇన్‌సైడ్‌ ఫ్యురియోజా.. అక్టోబర్‌ 15
ది డిప్లొమ్యాట్‌ సీజన్‌ 3.. అక్టోబర్‌ 16
రొమాంటిక్స్‌ ఎనోనిమస్‌.. అక్టోబర్‌ 16
గుడ్‌ న్యూస్‌.. అక్టోబర్‌ 17
షి వాక్స్‌ ఇన్‌ డార్క్‌నెస్‌.. అక్టోబర్‌ 17
టర్న్‌ ఆఫ్‌ ద టైడ్‌ సీజన్‌ 2.. అక్టోబర్‌ 17
ఉమెన్‌ ఇన్‌ క్యాబిన్‌.. ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌
స్విమ్‌ టు మీ
బూట్స్‌ సీజన్‌ 1
ది చూసేన్‌
నీరో
ది రిస్సరెక్టడ్‌ - ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌
విక్టోరియా బెక్‌ హ్యామ్‌ - ఇంగ్లీష్‌ డాక్యుమెంటరీ సిరీస్‌
ట్రూ హంటింగ్‌ - ఇంగ్లీష్‌ / హిందీ డాక్యుమెంటరీ

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:
పరమ్‌ సుందరి
ది మలబార్‌ టేల్స్‌ (కన్నడ మూవీ)
రిప్పాన్‌ స్వామి (కన్నడ మూవీ)
మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌ (ఇంగ్లీష్‌ / తెలుగు మూవీ)
ది థికెట్‌ (ఇంగ్లీష్‌ మూవీ)
టు డై అలోన్‌ ( ఇంగ్లీష్‌ మూవీ)
వెడ్డింగ్‌ ఇంపాజిబుల్‌: సీజన్‌ 1 వెబ్‌ సిరీస్‌

ఆహా :
ఆనందలహరి.. వెబ్‌ సిరీస్‌ (అక్టోబర్‌ 17)

జీ 5:
కిష్కింధపురి - అక్టోబర్‌ 17
భగవత్‌ చాప్టర్‌ 1 రాక్షస్‌.. వెబ్‌ సిరీస్‌ అక్టోబర్‌ 17

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.