English | Telugu
గాంధీని తిట్టిన శ్రీకాంత్ అయ్యంగార్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Updated : Oct 11, 2025
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున జాతిపిత 'మహాత్మాగాంధీ'(Mahatma Gandhi)ని విమర్శిస్తు ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth iyengar)సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సదరు వీడియో వైరల్ కావడంతో శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. బంజారాహిల్స్ లోను శ్రీకాంత్ పై కేసు నమోదైంది.