English | Telugu

ఓవర్సీస్‌లో ప్రభాస్‌, ఎన్టీఆర్‌ తర్వాత స్థానం తేజదే!

కేవలం రెండు భారీ సినిమాలతో భారీ విజయాలను అందుకున్న తేజ సజ్జ.. ఇప్పుడు స్టార్‌ హీరోలతో పోటీ పడే రేంజ్‌కి వెళ్ళిపోయాడు. తాజాగా విడుదలైన ‘మిరాయ్‌’ కలెక్షన్లపరంగా జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 100 కోట్ల మార్క్‌ని దాటిన ‘మిరాయ్‌’ ఓవర్సీస్‌లో కూడా తన హవా కొనసాగిస్తోంది. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించిన హీరోగా తేజ నిలిచాడు. ఓవర్సీస్‌లో 2.5 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసింది మిరాయ్‌. అంతకుముందు ప్రభాస్‌ సినిమాలు సలార్‌, కల్కి, ఎన్టీఆర్‌ సినిమాలు ఆర్‌ఆర్‌ఆర్‌, దేవర చిత్రాలు 2.5 మిలియన్‌ డాలర్లు వసూలు చేశాయి.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోలతో పోలిస్తే తేజ చేస్తున్న సినిమాలు ఆ స్థాయి బడ్జెట్‌లో ఉండవు. కానీ, బడ్జెట్‌తోకాదు, కంటెంట్‌తో హిట్‌ కొట్టి చూపిస్తున్నాడు. అతని సినిమాలకు టాప్‌ డైరెక్టర్లు వర్క్‌ చెయ్యడం లేదు. అయినా అతని సినిమాలు ఆ రేంజ్‌ కలెక్షన్స్‌ సాధించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా రిలీజైన ‘మిరాయ్‌’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.2 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫస్ట్‌ వీక్‌లో రూ.112.10 కోట్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ‘మిరాయ్‌’ నార్త్‌ అమెరికాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఈ సినిమా 2.5 మిలియన్‌ డాలర్లు సాధించింది. సూపర్‌ యోధ నార్త్‌ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ఎదురులేని జర్నీ కొనసాగిస్తున్నాడని, 3 మిలియన్‌ డాలర్లు టార్గెట్‌గా దూసుకెళ్తున్నాడని నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ఎనౌన్స్‌ చేసింది. కేవలం రెండు సినిమాలతోనే ప్రభాస్‌, ఎన్టీఆర్‌ వంటి హీరోల సరసన చేరడం తేజ సజ్జాకి గుడ్‌ సైన్‌ అని అందరూ ప్రశంసిస్తున్నారు.


‘మిరాయ్‌’ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపుతోంది. నార్త్‌ అమెరికాలో తాజాగా 2.5 మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లోకి ఎంటరై అరుదైన ఘనతని అందుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘మిరాయ్‌’ దూసుకుపోతోందని, ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో నార్త్‌ అమెరికాలో 2.5 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లు దాటి 3 మిలియన్‌ డాలర్ల మార్క్‌ దిశగా పయనిస్తున్నామని మేకర్స్‌ ప్రకటించారు.

లి ‘ఓజీ’కి భారీ టార్గెట్‌ ఫిక్స్‌.. హిట్టు కొట్టాలంటే ఎన్ని కోట్లు రావాలంటే!
%వీఱతీaఱ ూబపశ్రీఱష ుaశ్రీస%: మిరాయ్‌.. హరి హర వీరమల్లు కంటే 100 రెట్లు బెటర్‌..

ఈ మార్క్‌తో తేజ సజ్జా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ప్రభాస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ల సరసన నిలిచాడు. సలార్‌, కల్కి చిత్రాలతో ప్రభాస్‌ ఓవర్సీస్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ 2.5 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లు రాబట్టాడు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌, దేవర చిత్రాలతో ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పుడు యంగ్‌ హీరో అయిన తేజ కూడా ఆ రికార్డును అందుకోవడం విశేషం. గతంలో ‘ హనుమాన్‌ ’ చిత్రం ఓవర్సీస్‌లో 2.5 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టగా ఇప్పుడు ‘మిరాయ్‌’ కూడా ఆ మార్క్‌ దాటింది. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో తేజకి ఓవర్సీస్‌ మార్కెట్‌ భారీగా పెరిగిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతోన్న పెద్ద పెద్ద స్టార్లకే సాధ్యం కాని రికార్డును ఓ యంగ్‌ హీరో అందుకోవడం విశేషమనే చెప్పాలి. సరైన కంటెంట్‌ ఉంటే హీరో ఎవరన్నది పట్టించుకోమని ‘మిరాయ్‌’ ద్వారా ప్రేక్షకులు టాలీవుడ్‌కి ఓ క్లారిటీ ఇచ్చినట్లయింది.