English | Telugu

నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ రెడీ నా!

- మాస్ జాతర ఎలా ఉండబోతుంది!
- రవితేజ ప్లాఫ్ ల నుంచి బయట పడతాడా!
- మాస్ జాతర స్పెషల్ ఏంటి!
- నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఏం చేయబోతుంది!

మాస్ మహారాజా 'రవితేజ'(Raviteja)కి ఉన్న సినీ ప్రోటాన్షియల్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తనదైన ఎనర్జిటిక్ నటనతో సిల్వర్ స్క్రీన్ కే ఒక సరికొత్త ఉత్సాహాన్ని,ఊపుని తీసుకొస్తాడు. అంత చరిష్మా రవితేజ సొంతం. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని చవి చూసిన రవితేజ గత కొంత కాలంగా పరాజయాలని అందుకుంటున్నాడు. దీంతో నవంబర్ 1 న ల్యాండ్ అవుతున్న 'మాస్ జాతర'(Mass Jathara)రిజల్ట్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.


ఇక ఏ హీరో సినిమా రిలీజైనా సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఒకటి ఎప్పటికప్పుడు సరికొత్త పంధాతో ఉంటుంది. ఎంతలా అంటే అసలు వరల్డ్ వైడ్ గా ఎక్కడ షో కూడా ప్రదర్శించకముందే, పలానా చోట షో వేశారని చెప్తారు. పబ్లిక్ టాక్ నెగిటివ్ గా ఉందంటు, వేరే సినిమాల వీడియో క్లింపింగ్స్ ని యాడ్ చేస్తారు. పైగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ హవా కూడా నడుస్తుంది. దీంతో నెగిటివ్ బ్యాచ్ ఎంతగా విజృంభిస్తారో అర్ధం చేసుకోవచ్చు.

Also Read: బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది! థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇదే

రవితేజ కెరీర్ లోనే మాస్ జాతర అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో పాటు రవితేజ చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత మాస్ ఎలిమెంట్స్ తో కూడిన హిట్ సాంగ్స్ ని విన్నామని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూవీ పక్కా హిట్ అనే నమ్మకం కూడా వాళ్ళల్లో ఉంది. రవితేజ తో పాటు చిత్రబృందం కూడా అదే నమ్మకంతో ఉన్నారు.

కాంబినేషన్ పరంగా చూసుకున్నా థమాకా తో శ్రీలీల(Sreleela),రవితేజ కాంబో చేసిన మ్యాజిక్ తెలిసిందే. దీంతో ఆ ఇద్దరి ఫెయిర్ మాస్ జాతర కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒక రకంగా థమాకా టీం నే మాస్ జాతర టీం గా భావించవచ్చు. థమాకా కి రచయిత భాను బోగవరపు(Bhanu Bogavarapu)నే మాస్ జాతర కి దర్శకుడు. గుంటూరు కారం, డాకు మహారాజ్, కింగ్ డమ్ ఫేమ్ నాగవంశీ నిర్మాత.