English | Telugu
ఈ సారైనా గట్టెక్కుతాడా! సెన్సార్ టాక్ ఇదే!
Updated : Oct 25, 2025
వరుస పరాజయాలతో సతమవుతున్న మాస్ మహారాజా 'రవితేజ'(Raviteja)ఈ నెల 31 న తన అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండటంతో పాటు, రవితేజ సరసన శ్రీలీల(Sreeleela)జతకట్టడం, ఇప్పటి వరకు భీమ్స్(Bheems)సంగీత సారధ్యంలో రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రవితేజ ఈ సారి ప్లాప్ ల గండం నుంచి గట్టెక్కినట్టే అనే మాటలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా మాస్ జాతర కి సంబంధించిన సెన్సార్ వర్క్ పూర్తయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా 160 నిముషాల నిడివితో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. సెన్సార్ జరిగిన విషయాన్నీచిత్రబృందం అధికారకంగా ప్రకటించడంతో పాటు 'మాస్ ఫన్ అండ్ యాక్షన్ ఒక దానిలోనే. ఎంటర్ టైన్ మెంట్ మాస్ వేవ్ ని థియేటర్ లో ఆస్వాదించండంటు' ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా టాక్.
మాస్ జాతరని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చినట్టుగా రూపొందించామని నూతన దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bogavarapu)పలు ఇంటర్వూస్ లో చెప్తు వస్తున్నాడు. రవితేజతో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఫలితంపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర, నితీష్ నిర్మల్, రీతు పి సూద్ ప్రధాన పాత్రలని పోషించగా ట్రైలర్ ఈ నెల 27 న విడుదల కానుంది.