English | Telugu
ఆమె పుట్టినరోజుకు పండగే పండగ
Updated : Nov 5, 2013
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాలు "బాహుబలి", "రుద్రమదేవి". అయితే నవంబర్ 7వ తేదీన అనుష్క పుట్టినరోజు సంధర్భంగా "రుద్రమదేవి" చిత్రం యొక్క మొదటి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు దర్శకుడు గుణశేఖర్. అదే విధంగా ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా రాజమౌళి "బాహుబలి" ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కానీ ఈ ఫస్ట్ లుక్ పై పలు కామెంట్లు రావడంతో, ఎలాగైనా తన సత్తా చూపించాలనే ఉద్దేశ్యంతో అనుష్క పుట్టినరోజు సంధర్భంగా "బాహుబలి" లోని అనుష్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. అంటే అనుష్క పుట్టినరోజుకి "బాహుబలి", "రుద్రమదేవి" చిత్రాల రెండు ఫస్ట్ లుక్ లతో అనుష్క తన అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నదన్నమాట.