English | Telugu
నెపో కిడ్ ఎవరో తెలుసా అంటున్న మంచు మనోజ్.. నువ్వు సూపర్ స్వామి
Updated : Jul 9, 2025
'మంచు మోహన్ బాబు'(Manchu MOhanbabu)రెండవ నట వారసుడు 'మంచు మనోజ్'(Manchu Manoj)తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మే 30 న 'భైరవం'(Bhairavam)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో 'గజపతి వర్మ' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి తన నటనకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పాడు. ప్రస్తుతం హనుమాన్ మూవీ తేజ హీరోగా చేస్తున్న 'మిరాయ్'(Mirai)లో విలన్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఓ భామ, అయ్యో రామ' అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మనోజ్ ముఖ్య అతిధిగా హాజరవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతు బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ బ్యాక్ గ్రౌండ్ ఒక స్థాయి వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. నన్ను కూడా 'నెపో కిడ్ అని అంటారు. ఒక నెపో కిడ్ గా చెప్తున్నాను. నెపో కిడ్ అయినంత మాత్రాన ఇండస్ట్రీ లో పప్పులు ఉడకవు. ప్రతి ఒక్కరు తమ సినీ లైఫ్ కోసం కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చాడు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని 'నెపో కిడ్' అని పిలుస్తారనే విషయం తెలిసిందే.
'ఓ భామ అయ్యో రామ'లో సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించగా బబ్లూ పృథ్వీ రాజ్, నువ్వు నేను ఫేమ్ అనిత, ప్రభాస్ శ్రీను కీలక పాత్రల్లో చేస్తున్నారు. రామ్ గోదాల(Ram Godhala) దర్శకత్వంలో హరీష్ నల్లా నిర్మించడం జరిగింది.