English | Telugu
సైకిల్ ఎక్కిన నాగార్జున
Updated : Apr 3, 2014
అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "మనం" చిత్ర ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త స్టిల్ ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తుంది. చిన్న సైకిల్ మీద నాగార్జున ఉండగా.. దాని వెనకాలే నాగచైతన్య పరుగు పెట్టడం ఈ ఫోటోలో చూడవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈనెల చివరి వారంలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాను మే 23న విడుదల చేయనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రియ, సమంత కథానాయికలు.