English | Telugu

రేసుగుర్రం పేరు మారిపోయింది

మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీని అక్కడ అభిమానులు మల్లు అర్జున్ అని పిలుస్తారు. బన్నీ నటించిన "రేసుగుర్రం" చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని మలయాళంలో "లక్కీ... ద రేసర్" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. తెలుగు, మలయాళం భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. తమన్ సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.