English | Telugu

ఆ సినిమా బావ-బావమరుదుల్ని కలిపింది!

ఆ సినిమా పేరు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’. హీరో హీరోయిన్లు ఎలా కలుసుకున్నారనేది ఈ సినిమా కథాంశం. మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు ఇందులో హీరో. నందిత హీరోయిన్. ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే వుంది. ఎందుకంటే, ఈ సినిమా బావ బావమరుదులైన సుధీర్‌బాబు, మహేష్‌బాబులను కలిపింది. అంటే అర్థం, వాళ్ళిద్దరూ గతంలో గొడవపడి విడిపోయారని కాదు.. ఇద్దరూ కలసి ఈ సినిమాలో నటిస్తున్నారని! అవును, మహేష్‌బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ‘ఆగడు’ సినిమా షూటింగ్ పూర్తవగానే మహేష్ ఈ సినిమాలో షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ విషయాన్ని దర్శకుడు చంద్రు తెలియజేస్తూ, ‘‘మా సినిమాలో మహేష్‌బాబు గారి కోసం ఓ ప్రత్యేక పాత్రకు రూపకల్పన చేశాం. ఆయనకు ఆ కేరెక్టర్ గురించి చెప్పగానే నటించడానికి ముందుకొచ్చారు. మహేష్, సుధీర్ కలసి తెరమీద కనిపిస్తారు’’ అన్నారు.