English | Telugu
దావూద్' సినిమా ప్రారంభమైంది
Updated : Jul 2, 2014
యథార్థ సంఘటన ఆధారంగా మరో సంచలన మూవీ తెలుగులో రాబోతోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా 'దావూద్' సినిమా ప్రారంభమైంది. దావూద్ జీవితంలోని కొత్త కోణాలను బయటపెడుతూ ఈ సినిమా తెరకెక్కనుందని డైరెక్టర్ రాజేష్ పుత్ర తెలిపారు. దావూద్ ఆ మార్గం ఎంచుకోవడానికి కారణాలేంటో తమ సినిమాలో చూపిస్తున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం తొమ్మిది భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ ప్రారంభమైంది. 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.