English | Telugu

పూరి చేతిలో సినిమా లేదు !!


స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ కెరీర్‌లో ఈ రకమైన సమస్య ఎదురవడం బహుశా ఇదే మొదటిసారి. "బద్రి"తో కెరీర్‌ను ఆరంభించిన పూరి.. అప్పటినుంచి వరుసబెట్టి ఒకదాని తర్వాత ఒక సినిమాను తెరకెక్కిస్తూనే ఉన్నాడు. సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేయడంలో పూరి జగన్నాధ్ సిద్ధహస్తుడు.

అయితే.. తాజాగా విడుదలైన "ఇద్దరమ్మాయిలతో" తర్వాత పూరి దర్శకత్వం వహించే చిత్రమేది సెట్స్‌పైకి వెళ్లలేదు. హిందీలో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు పూరి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దాంతో మళ్లీ మహేష్‌తో సినిమా అని ఎనౌన్స్ చేసాడు.

కానీ మహేష్‌తో పూరి సినిమా ఇప్పుడప్పుడే సెట్స్‌పైకి వెళ్లే అవకాశమేమి కనిపించడం లేదు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఒన్ నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్న మహేష్‌బాబు.. ఆ చిత్రం అనంతరం శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే "ఆగడు" చిత్రంలో నటిస్తాడు.

"ఆగడు" ప్రారంభమయ్యే వరకూ..పూరి చిత్రం ఆరంభమయ్యే అవకాశం లేదు!