English | Telugu
ఏప్రిల్ 18న థియేటర్లలో 268 కిలోలు
Updated : Apr 9, 2014
అల్లరి నరేష్, పూర్ణ, భూమిక ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం "లడ్డుబాబు". ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న విడుదల చేయనున్నారు. మహారధి ఫిలిమ్స్ పతాకంపై రాజేంద్ర త్రిపురనేని నిర్మించారు. ఇందులో నరేష్ దాదాపు 268 కిలోల బరువు గల భారీమనిషిగా కనిపిస్తున్నాడు. నరేష్ నటన, తన పట్టుదల చాలా అభినందించదగ్గ విషయం అని దర్శక నిర్మాతలు అన్నారు. చక్రి అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.