English | Telugu

మహేష్ లక్కీ గర్ల్‌కి మరో ఆఫర్


ఆవ్ తుజో మో కోర్తా... హలో ఓ రాక్ స్టార్ అంటూ మహేష్ బాబు పక్కన 1 నేనొక్కడినే సినిమాలో హల్ చల్ చేసిన కృతీ సనన్ తెలుగు వారికి గుర్తుండే వుంటుంది. మరిచిపోయే అందం కూడా కాదు ఆ అమ్మాయిది. అయితే బేసికల్‌గా ఢిల్లీకి చెందిన కృతీకి తెలుగు సినిమాలో గుర్తింపు రాకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె నటిచింన హిందీ చిత్రం ‘హీరోపంతి’తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది కృతీ. సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టుకోలేక పోయినా కృతీకి రావలసిన క్రెడిట్ మాత్రం వచ్చేసింది.

ఈ సినిమాలో కృతిని చూసి చూడగానే బాలీవుడ్ లక్కీమస్కట్ గా మారిన ప్రభుదేవ తన నెక్స్ట్ సినిమాకు ఆఫర్ ఇచ్చేసాడు. అదీ అక్షయ్ కుమార్ పక్కన. ఇంకేముంది కృతి శృతిలో యాం సో లక్కీ అంటూ పాట పాడేసుకుందట. కృతి త్వరలో మరో సినిమా తెలుగు సినిమాలో కనిపించే అవకాశం కూడా వుందని తెలుస్తోంది.