English | Telugu
హాట్ భామతో కొడుకు చిందులు
Updated : Dec 3, 2013
అల్లు శిరీష్, రెజినా జంటగా నటిస్తున్న చిత్రం "కొత్తజంట". మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు హిట్స్ లలో ఒకటైన "అటు అమలాపురం.." అనే సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఐటెం గర్ల్ గా నటిస్తున్న మధురిమతో కలిసి శిరీష్ తెగ చిందులేస్తున్నాడు. ఈ షూటింగ్ సమయంలో నిర్మాత అల్లు అరవింద్,అల్లు అర్జున్ షూటింగ్ స్పాట్ కి విచ్చేసిన క్షణంలో దిగిన ఫోటో మీకోసం. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.