English | Telugu

అబ్బా.... అవన్నీ వద్దు..!

శింబుతో నయన ప్రేమాయణం ముగిసిందనుకున్న కథ కాస్త తమిళ దర్శకుడు పాండిరాజ దయవల్ల మళ్ళీ మొదలైంది. అయితే శింబు, నయనతార హీరోహీరోయిన్లుగా పాండిరాజ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇందుకోసం చాలా కష్టపడి నయన్ ని ఒప్పించాడు. అయితే త్వరలోనే నయన్, శింబుల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్న క్షణంలో... డైరెక్టర్ కు నయన్ కొన్ని షరతులు పెట్టింది. అదేమిటంటే.... శింబుతో ఎలాంటి లవ్ సీన్స్, ముద్దులు,కౌగిలింతలు వంటివి ఉండరాదు. హాట్ సీన్స్ అసలే ఉండరాదు అంటూ ఒక పది షరతుల ఓ లిస్టుని దర్శకుడి ముందు ఉంచిందట. దాంతో దర్శకుడికి ఏం చెయ్యాలో తెలియక కథలో కొన్ని మార్పులు చేసే పనిలో పడ్డాడని తెలిసింది. మరి వీళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ లేవంటే... ఇది ప్రేమకథా చిత్రమా లేక టామ్ అండ్ జెర్రీ చిత్రమా అనేది త్వరలోనే తెలియనుంది.