English | Telugu

దిల్ రాజు ఆశలన్నీ 'కేరింత' పైనే..!

చిన్న సినిమాలతో వరుస హిట్లు కొట్టి మంచి నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజు గత కొంతకాలంగా భారీ సినిమాలు తీసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. మళ్ళీ సక్సెస్ బాట పట్టడానికి తన పాత దారిలోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం డైరెక్టర్ గా రెండు వరుస విజయాలు సాధించిన వినాయకుడు ఫేం సాయికిరణ్ అడివితో 'కేరింత' అనే ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అంతా కొత్త వాళ్లతో నిర్మించబోతున్న ఈ చిత్రానికి ముందుగానే స్టార్ హంట్ చేసి నటీ నటులను ఎంపిక చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ౦కానున్న ఈ సినిమాపై దిల్ రాజు చాలా ధీమాగా వున్నాడట. దర్శకుడు సాయి కిరణ్ అడివి,అతని టీమ్ రెండేళ్లు కష్టపడి స్క్ర్రిప్ట్‌పై వర్క్ చేయడంతో బాగా వచ్చిందని అంటున్నారు. దిల్ రాజు గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీలో కూడా ఫ్రెష్ ఫీల్ వుంటుందట. ఈ సినిమాతో తాను మళ్ళీ పాత ట్రాక్ లోకి వస్తానని రాజుగారు ధీమాగా వున్నారట. సెప్టెంబర్‌ లో సినిమాను కంప్లీట్‌ చేసి దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.