English | Telugu

మహేష్ కి అఖిల్ టెన్షన్..!

అక్కినేని కుటుంబం నటించిన 'మనం' సినిమా క్లైమాక్స్ లో రాకింగ్ ఎంట్రీ ఇచ్చాడు సిసింద్రీ అఖిల్. స్ర్కీన్ పై క‌నిపించేది కాసేపే అయినా... అత‌ని స్ర్కీన్ ప్రెజెన్స్ అదిరింద‌ని అంద‌రూ అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అఖిల్ క్లాస్ టచ్ తో మాస్ స్టయిల్ లో కనిపించాడు. ఇక తెర‌పై అఖిల్ ఎలా ఉంటాడ‌న్న విష‌యంలో తిరుగులేని క్లారిటీ వ‌చ్చింది. అఖిల్ అందం అమ్మాయిల్ని నివ్వెర‌పోయేలా చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి అందంలో, అమ్మాయిలా ఫాలోయింగ్ లో ఏ హీరో పోటీని ఇవ్వలేకపోయారు. అఖిల్ ఎంట్రీతో ఇక మహేష్ కి కష్టాలు మొదలవడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లే మొదటి సినిమాతో అఖిల్ అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడని ఆశిద్దాం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.