English | Telugu
వంద కోట్ల క్వీన్ సోనాక్షి సిన్హా
Updated : Jun 24, 2014
బాలీవుడ్ సినీపరిశ్రమలో ఇప్పుడు సినిమా సక్సెస్ నిర్వచనం మారిందనే చెప్పాలి. వంద కోట్ల బిజినెస్ చేస్తేగాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించిందని అనుకోవటంలేదు బాలీవుడ్ వర్గాలు. వంద కోట్ల బిజినెస్ చేసిన హీరోల కంటే ఆ సినిమాలలో నటించిన హీరోయిన్‌లకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తోంది. గత ఏడాది ఎక్కువ కలెక్షన్లతో బాలీవుడ్ బాక్సాఫిస్ క్వీన్ గా నిలిచింది దీపికా పదుకోన్. ఈ సారి ఆ స్థానాన్ని సోనాక్షి సొంతం చేసుకునేపనిలో వున్నట్టు కనిపిస్తోంది. లేటెస్టుగా 100 కోట్ల బిజినెస్ చేసిన ఐదు సినిమాలు ఈ ముద్దుగుమ్మ అకౌంట్‌లోకి చేరాయి.
సోనాక్షి సిన్హా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన హాలిడే చిత్రం తాజాగా వంద కోట్ల బిజినెస్ హౌస్‌లో చేరింది. విడుదలైన 15 రోజులకే ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్లు రాబట్టుకుంది. కరీనా, దీపిక, కత్రీనా, ప్రియాంక, అసిన్ ల ఖాతాల్లో వంద కోట్ల బిజినెస్ చేసిన నాలుగు నాలుగు సినిమాలున్నాయి. హాలిడే చిత్రం తాజాగా రాబట్టుకున్న కలెక్షన్లతో సోనాక్షి కొత్త రికార్డు సాధించింది. నూరు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన అత్యధిక చిత్రాలు సోనాక్షి ఖాతాలోచేరినట్లయింది. కలెక్షన్లు, రికార్డులు కలిసివస్తున్న సోనాక్షికి ఈపాటికేలీవుడ్ నిర్మాతలు రెడ్ కార్పెట్ పరిచేసి వుంటారు.