English | Telugu
అలాంటివి చెయ్యనని చెప్పేసిన అనుష్క
Updated : Oct 28, 2013
"అరుంధతి" చిత్రంతో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఎక్కువ అయ్యాయి. అయితే అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "వర్ణ". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో అనుష్క మాట్లాడుతూ... "రుద్రమదేవి", "బాహుబలి","వర్ణ" చిత్రాల్లో కత్తి పట్టే సినిమాలే. కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇలా కత్తి పట్టే సినిమాలు కాకుండా హీరోలతో డాన్స్, లవ్ స్టొరీ చిత్రాలే చేయాలని అనుకుంటున్నాను అని తెలిపింది. అంటే అనుష్క హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు పూర్తిగా మానేసినట్లే ఇక. త్వరలోనే అనుష్క ఓ ప్రేమ కథ చిత్రాలు చేయనున్నది. కానీ ఈ మూడు చిత్రాలు విడుదల కావాలంటే మరో ఒకటిన్నర సంవత్సరమైన పడుతుంది. అంతవరకు అనుష్కను ఇలా యాక్షన్ లేడిగానే చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే.