English | Telugu

డ్రగ్స్ కేసు కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. ఫలించిన హేమ ఏడాది న్యాయ పోరాటం.!

ప్రముఖ నటి హేమకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. గతేడాది ఆమెపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. (Actress Hema)

2024 మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను అప్పుడే హేమ ఖండించారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజం నిలకడమీద తెలుస్తుందని అన్నారు. అన్నట్టుగానే సంవత్సరం పాటు న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు ఆమెకు కోర్టు నుండి గుడ్ న్యూస్ అందింది.

Also Read: వివాదంలో యాంకర్ శివజ్యోతి..!

నటి హేమపై నమోదైన కేసులను తాజాగా కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో హేమ సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది పాటు ఎంతో బాధను అనుభవించానని, ఈరోజు నిజం గెలిచిందని అన్నారు. ఈ బాధాకర ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హేమ కృతఙ్ఞతలు తెలిపారు.