English | Telugu
దిల్ దివానా పాటలో క్రికెటర్ కపిల్
Updated : Nov 21, 2013
శేఖర్ కమ్ముల శిష్యుడు తుమ్మా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "దిల్ దివానా". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముఖ్య అతిదిగా విచ్చేసారు. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించిన వారందరూ కూడా యంగ్ స్టార్సే. వీళ్ళందరినీ ప్రోత్సహించడానికే ఈ సమావేశంలో పాల్గొన్నాను.నా కెరీర్ లో ఇలాంటి వేడుకకి రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా హిందీలోకి అనువాదమైతే తప్పకుండా చూస్తాను అని అన్నారు.