English | Telugu
ఎ.పి.ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ భవనం ప్రారంభం
Updated : Nov 20, 2013
"ఎన్టీఆర్ సినీ కార్మిక భవనం" పేరుతొ ఎ.పి.ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధులుగా విచ్చేసారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ...."ఏపి ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ భవనం ఏర్పాటు అనేది ఎన్నో ఏళ్ల కల. అది ఇప్పటికి నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఫెడరేషన్ భవనానికి జమున గారు తన వంతు సహాయం చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు. అలాగే జనవరి 6వ తేదీతో ఫైటర్స్ అసోసియేషన్ కి సంబంధించిన సమస్యలు కూడా తీరబోతున్నాయి" అని అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ..."ఈ భవనానికి ఎన్టీఆర్ సినీ కార్మిక భవనం అని నాన్న గారి పేరు పెట్టడం చాలా ఆనందంగానూ, మీ అభిమానానికి గర్వంగా కూడా ఉంది. ఈ ఫెడరేషన్ లో అందరూ కూడా కలిసి ఉండి, సమస్యలను పరిష్కరించుకోవాలి. దీనికి సంబంధించి ఏ అవసరానికైనా మేం సహకరిస్తాం" అని అన్నారు.
నటి జమున తనవంతుగా 50,000/- రూపాయల చెక్కును దాసరి, బాలయ్య చేతుల మీదుగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు కొమర వెంకటేష్ కు అందచేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో డా.డి.రామానాయుడు, జమున, శ్యాంప్రసాద్ రెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.