English | Telugu

'కాంతార చాప్టర్ 1' సంచలన రికార్డు!

ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన భారతీయ చిత్రంగా 'ఛావా' నిలిచింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ హిందీ సినిమా.. ఫిబ్రవరిలో విడుదలై రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టింది. తాజాగా 'ఛావా'ను వెనక్కి నెట్టి, కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1' టాప్ ప్లేస్ లోకి వచ్చింది. (Kantara Chapter 1)

'కాంతార'కి ప్రీక్వెల్ గా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడో వారం పూర్తి చేసుకొని, నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ.. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ మంచి వసూళ్ళు రాబడుతోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన ఇండియన్ ఫిల్మ్ గా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇతర పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో.. మరో రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

2025 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో 'కాంతార చాప్టర్ 1', 'ఛావా' తరువాతి స్థానంలో రూ.500 కోట్లకు పైగా గ్రాస్ తో 'సైయారా' ఉంది. రూ.300 గ్రాస్ తో తెలుగు సినిమా 'ఓజీ' టాప్-10 లో చోటు దక్కించుకుంది.