English | Telugu
ప్రభుదేవాకి మళ్ళీ పెళ్లి?
Updated : Nov 12, 2020
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా మళ్ళీ పెళ్లి చేసుకోనున్నారా? అంటే... తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి 'అవును' అని సమాధానం వస్తోంది. ప్రభుదేవా మళ్ళీ ప్రేమలో పడ్డారని, ఈసారి పెళ్లికి రెడీ అవుతున్నారని చెబుతున్నాయి. అందులో నిజానిజాలు ఎంత? అనేది తెలియడం లేదు. అయితే, చెన్నై సినిమా సర్కిళ్లలో పెళ్లి వార్తలు బలంగా షికార్లు చేస్తున్నాయి.
గతంలో నయనతారతో కొన్నాళ్లు సహజీవనం చేశారు ప్రభుదేవా. భర్త తీరుపై అప్పట్లో రమలత నిరసన వ్యక్తం చేశారు. సహా జీవనానికి స్వస్తి చెప్పి, తనతో కలిసి ఉండేలా భర్తకు ఆదేశాలు ఇవ్వమని కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఆ తరవాత కొన్నాళ్ళకు రమలతకు ప్రభుదేవా విడాకులు ఇచ్చారు. నయనతారతో బంధం కూడా తెగింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు. కోలీవుడ్ లేటెస్ట్ గాసిప్ ప్రకారం... మేనకోడలు ఎవరితోనో ప్రభుదేవా ప్రేమలో పడ్డారట. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. దీనికి ప్రభుదేవా స్పందిస్తే గాని నిజానిజాలు బయటకు రావు.