English | Telugu
ఎన్టీఆర్ ట్విట్టర్‌లో గుసగుసలు
Updated : Jul 3, 2014
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం విడుదలైన రెండో రోజు నటసింహం నందమూరి బాలకృష్ణ వీక్షించి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయి కొర్రపాటిపై అభినందనల వర్షం కురిపించారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాన్ని చూసి... ‘సినిమా చాలా బాగుంది. ఇటువంటి సినిమాలు తెలుగులో మరెన్నో రావాలి’ అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి, చిత్ర దర్శకుడు శ్రీని అవసరాలకు, హీరోహీరోయిన్లు నాగశౌర్య`రాశిఖన్నాకు తన అభినందనలు అందించారు!