English | Telugu

గుర్రం పై గోవిందుడు

గుర్రం స్వారీ చేస్తూ, కత్తి తిప్పే హీరోలంటే నేటికీ క్రేజ్ ఎక్కువే అని మగధీర చిత్రం నిరూపించింది. మగధీర చిత్రంలో గుర్రం మీద రామ్ చరణ్ స్వారీ చేసిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. రియల్ లైఫ్ లో కూడా చరణ్ గుర్రం స్వారీ చక్కగా చేయగలగడంతో ఆ సినిమాలో క్యారెక్టర్ కి మరింత గ్రేస్ వచ్చిందని కూడా అన్నారు. తనకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీ చేస్తూ మరోసారి రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కొన్ని సన్నివేశాలలో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించబోతున్నాడు. మగధీరా చిత్రంతో ఎంతగానో ఆకట్టుకున్న రామ్ చరణ్, కాజల్ ఈ చిత్రంలో మరోసారి జంటగా కనిపించనున్నారు. హైదరాబాద్ నానాక్ రాం గూడాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 1 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.