English | Telugu

బుల్లి ఎన్టీఆర్‌ పేరు..‘అభయ్‌రామ్‌'

జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి ఆదివారం నామకరణం చేశారు. తన కుమారుడికి ‘అభయ్‌రామ్‌' అని నామకరణం చేసినట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడే నామకరణ కార్యక్రమం పూర్తయ్యింది.. చాలా ఆనందంగా వుంది.. నా కుమారుడి పేరు అభయ్‌రామ్‌..’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. గత జులై 22 న ఎన్టీఆర్ కు కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. నా జీవితంలో నేను పొందిన బెస్ట్ గిఫ్ట్ మా అబ్బాయి అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.