English | Telugu

అప్పుడు మహేష్.. ఇప్పుడు జయకృష్ణ.. మరో సూపర్ స్టార్ అవుతాడా?

మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా 'రాజకుమారుడు'. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం.. హీరోగా మహేష్ కి శుభారంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో మహేష్, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అశ్వనీదత్ చేతుల మీదుగా ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో హీరో పరిచయమవుతున్నాడు.

కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతని మొదటి సినిమాకి 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి సినిమాలతో గుర్తింపు పొందిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. అశ్వనీదత్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని.. జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ హ్యాండ్ కలిసొచ్చి.. బాబాయ్ మహేష్ బాటలోనే జయకృష్ణ కూడా స్టార్ గా ఎదుగుతాడని ఘట్టమనేని ఆశపడుతున్నారు.

చిత్తూరు నేపథ్యంలో ఓ విభిన్న ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయకృష్ణ తన లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. యాక్టింగ్ కూడా అదరగొడతాడేమో చూడాలి.