English | Telugu
వాళ్ళ అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు.. జాన్వీకపూర్ సంచలన వ్యాఖ్యలు
Updated : Oct 25, 2025
అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi)నటవారసురాలు జాన్వీకపూర్(Janhvi Kapoor)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో జతకడుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ 'శ్రీలంక'(Srilanka)లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో చరణ్, జాన్వీ కపూర్ పై సాంగ్స్ ని చిత్రీకరించనున్నారు. రీసెంట్ గా జాన్వీకపూర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో'(Too much with kajol and twinkle show)కి ప్రముఖ దర్శకుడు , నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి గెస్ట్ గా వెళ్ళింది. ఈ ప్రోగ్రాం కి ఒకప్పటి అగ్ర హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు.
సదరు షో లో జాన్వీ కపూర్ మాట్లాడుతు సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇండస్ట్రీ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ కొనసాగాలంటే పురుష అహంకారాన్ని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యగలను. కానీ అదే నలుగురు పురుషులు ఉన్న చోట కుదరదు. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా మన అభిప్రాయాన్ని చెప్పాలి. ఇందుకు చాలా ఓర్పు కావాలి. గొప్పగా నటించే సామర్థ్యం ఉన్నా, అవతలి వారి కోసం తగ్గి నటించాలి. మనకి నచ్చని విషయాలు ఎదురైనప్పుడు నచ్చలేదని చెయ్యనని చెప్పే బదులు అర్ధం కాలేదని మౌనంగా ఉండాలి. ఎన్నో రాజకీయాలని కూడా ఎదుర్కోవాలని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ మాటలని ట్వింకిల్ ఖన్నా సమర్ధించడంతో పాటు, కరణ్ జోహార్ తన పక్కన ఉన్నప్పుడే జాన్వీకపూర్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
2018 లో దఢక్ అనే బాలీవుడ్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ ఈ నెల 2 న విడుదలైన 'సన్నీ సంస్కార్ కి తులసి కుమారి' వరకు సుమారు 13 చిత్రాల వరకు చేసింది. గత ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో దేవర లో జతకట్టింది. జాన్వీ తండ్రి అగ్ర నిర్మాత బోనీ కపూర్(Boney kapoor)హిందీలో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించాడు. కపూర్ ల ఫ్యామిలీ హిందీ సినిమా పుట్టిన దగ్గర నుంచే సినీ రంగంలో రాణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.