English | Telugu

ఐదు నెలల సమయం మాత్రమే!.. జై హనుమాన్ కీలక అప్ డేట్ ఇదేనా!

జై హనుమాన్ కీలక అప్ డేట్
మరో సంచలనానికి రిషబ్ శెట్టి రెడీ!
ప్రశాంత్ వర్మ ఏం చెప్పనున్నాడు.
జనవరి నుంచి ప్రారంభం కాబోతుందా!

కాంతార చాప్టర్ 1 (Kantara chapter 1)తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు 'రిషబ్ శెట్టి'(Rishab Shetty). భారతీయ సినీట్రేడ్ వర్గాలు సైతం ఎవరు ఈ రిషబ్ శెట్టి అనేంతలా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి సరికొత్త ఊపుని ఉత్సాహాన్నిఇచ్చాడు. రిషబ్ రాబట్టిన 900 కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్స్ నే అందుకు సజీవ సాక్ష్యం. దీంతో రిషబ్ శెట్టి అప్ కమింగ్ సినిమాల లిస్ట్ గురించి పాన్ ఇండియా అభిమానులే కాదు పాన్ ఇండియా సినీ ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి కి సంబంధించిన సినీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో వాళ్ళల్లో జోష్ వచ్చినట్లయింది.


రిషబ్ శెట్టి కమిట్ అయిన సినిమాల లిస్ట్ లో పాన్ ఇండియా హిట్ 'హనుమాన్' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'జై హనుమాన్'(Jai Hanuman)ఉన్న విషయం తెలిసిందే. యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ, మైథలాజికల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ(Prashanth Varma)దర్శకుడు. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. ఈ మేరకు రిషబ్ శెట్టి ఐదు నెలల డేట్స్ కేటాయించినట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే జనవరి నుంచి మే వరకు కంటిన్యూగా ఎలాంటి రెస్ట్ లేకుండా రిషబ్ శెట్టి షూటింగ్ లో పాల్గొంటాడనే టాక్ కూడా జోరుగా వినపడుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండటంతో అభిమానులు ఎప్పుడెప్పుడు జై హనుమాన్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని తమ ముందుకొస్తుందా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.


also read: నయనతార కి భారీ గిఫ్ట్.. విలువ 10 కోట్లరూపాయలని అంచనా


జై హనుమాన్ ని ప్రశాంత్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హనుమాన్ ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. హనుమాన్ క్లైమాక్స్ లో రాముడు ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు తీసుకున్న నిర్ణయంతో సినిమాకి ఎండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జై హనుమాన్ కథ, కథనాలపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కాంతార లో శివ స్తుతుడు గా వీర విహారం చేసిన రిషబ్ శెట్టి జై హనుమాన్ లో హనుమాన్ గా మరోసారి విజృంభించడం ఖాయం. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ కి వెళ్ళాల్సింది. కానీ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ వర్మ మధ్య విబేధాలు ఏర్పడటంతో జై హనుమాన్ షూటింగ్ కి వెళ్లలేకపోయింది.

ఇప్పుడు ఆ ఇష్యుస్ అన్ని క్లోజ్ అవ్వడంతోనే జనవరి లో షూటింగ్ కి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. జై హనుమాన్ ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. హనుమంతుడి రూపధారణలో ఉన్న రిషబ్ శెట్టి రాముడి ప్రతిమని అలింగనం చేసుకున్న మోషన్ పోస్టర్ ఇప్పటికే రిలీజైన విషయం తెలిసిందే.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.