English | Telugu
ఇదిగో స్పైసీ ఐస్‌క్రీం-2 ఫస్ట్‌లుక్
Updated : Jul 16, 2014
ఒక ఐస్‌క్రీం థియేటర్‌కి చేరీ చేరగానే రెండవది రెడీ అంటున్నారు రాంగోపాల్ వర్మ. సంచలనాలు సృష్టించడంలోనే కాదు సినిమాలు వేగంగా పూర్తి చేయడంలోనూ ఆయన సిద్ధహస్తులు. గతంలోనూ 2, 3 నెలల వ్యవధిలో వెంట వెంటనే చిత్రాలు నిర్మించి విడుదల చేశారు. ఇప్పుడు ఐస్‌క్రీం చిత్రం విడుదలై వారం రోజులు కూడా గడవక ముందే ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారని ప్రకటించారు. ప్రకటించిన వెంటనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా ప్రత్యక్షమయింది.
సెప్టెంబర్‌లో విడుదల అంటూ ఆ పోస్టర్‌లో డేట్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్‌లో పేరున్న దర్శకులు, సంవత్సరానికి, ఒకటి అర చిత్రాలు రూపొందిస్తూ ఆయాస పడుతున్నారు. అలాంటిది వర్మ ఇలా వెంటవెంటనే చిత్రాలు, చడీ చప్పుడు కాకుండా రూపొందిస్తున్నారు. సినిమా మేకింగ్‌లో ఆర్‌జీవీ వేగాన్ని అందిపుచ్చుకునేవారు ఇప్పట్లో ఎవరూ లేరనే చెప్పాలి.