English | Telugu

బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే గర్ల్ కత్రీనా


బాలీవుడ్ బాబీగర్ల్ కత్రీనా పుట్టిన రోజు జూలై 16. ఇంత స్పెషల్ డే ఆమె తనకెంతో స్పెషల్ అయిన వారితో గడుపుతుందనటంలో ఏ సందేహం లేదు. మరి ఈ సారి బర్త్‌డే ఆమె ఎక్కడ ఎవరితో గడపనుందో అనే విషయంలో మీడియాలో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి.


బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, కపూర్ ఫ్యామిలీకి చెందిన రణ్‌బీర్ కపూర్ తో కత్రీనా కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. అయితే రణ్‌బీర్ షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం విదేశాల్లో వున్నారు. ఇంత ముఖ్యమైన రోజు ఇష్టమైన వ్యక్తి చెంతన లేకపోతే వుండే లోటు అనుభవించాల్సిన పనేముంది. అందుకే కత్రీనా ఎగురుకుంటూ రణ్‌బీర్ షూటింగ్ చేస్తున్న కోర్సికాకు వెళ్లి వాలుతోందట.


ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ రణ్‌బీర్ ఇప్పుడు షూటింగ్ చేస్తోన్నది తన మాజీ ప్రేయసి దీపికాతో. అక్కడ కత్రీనా దీపికా ఒకరినొకరు చూసి ఎలా స్పందిస్తారో, కత్రీనా బర్త్‌డేకి అక్కడ రణ్‌బీర్ ఏం ఏర్పాట్లు చేసి వుంటాడో అనే విషయాలు ఇంకా సర్‌ప్రైజింగ్‌గా వుండబోతున్నాయి.
అన్నట్లు కొన్నేళ్ల క్రిందట ఇలాగే కత్రీనా బర్త్‌డే పార్టీలోనే షారుఖ్, సల్మాన్ గొడవపడ్డారు. వారు తిరిగి మళ్లీ కలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత కత్రీనా తన పుట్టిన రోజును తన కుటుంబ సభ్యులతో విదేశాల్లోనే చేసుకుంటోంది.