English | Telugu

ఇదే లాస్ట్‌ వార్నింగ్‌.. ఇకపై అలా చేస్తే లీగల్‌గా యాక్షన్‌ తీసుకుంటాను!

ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించిన ఎలాంటి న్యూస్‌ అయినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు హీరోలు, హీరోయిన్లు ట్రోలింగ్‌కి కూడా గురవుతున్నారు. వైరల్‌ అయ్యే వార్తల్లో నటీనటుల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆయా తారలు తమ పర్సనల్‌ ఫోటోలు కూడా షేర్‌ చెయ్యడం వల్ల ఆ రూమర్స్‌ మరింత పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లకు హీరోలతో లింకులు పెడుతూ రూమర్స్‌ స్ప్రెడ్‌ చేయడం సోషల్‌ మీడియాలో ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. అంతేకాదు, కొందరు హీరోయిన్లను ఏదో ఒక సాకుతో ట్రోల్‌ చేయడం కూడా బాగా పెరిగింది. అలా ఓ మలయాళ హీరోయిన్‌ ఇప్పుడు నెటిజన్ల వల్ల ఇబ్బందులు పడుతోంది.

ఆమె పేరు మహిమ నంబియార్‌. 2010 నుంచి మలయాళ, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఆమె కెరీర్‌లో హిట్‌ సినిమాల శాతం ఎక్కువే. ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించింది త్వరలో శ్రీవిష్ణు సరసన ఓ తెలుగు సినిమాలో నటించబోతోంది. మహిమ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లతో ఇంటరాక్ట్‌ అవుతూ తనకు సంబంధించిన పర్సనల్‌ విషయాలను కూడా వారితో షేర్‌ చేసుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఆమెను కొందరు వ్యక్తులు ట్రోల్‌ చేస్తూ ఆమెకు ఆందోళన కలిగిస్తున్నారు. ఆమె పేరుతో ఓ ఫేక్‌ ఐడిని క్రియేట్‌ చేసి దాని ద్వారా తను పంపిస్తున్నట్టుగా కొన్ని అభ్యంతరకర ఫోటోలు పంపిస్తున్నారు. ఇది ఆమెను మానసికంగా బాగా కుంగదీసింది. ఆమెకు సహనం నశించడంతో ఇటీవల గట్టి వార్నింగ్‌ ఇస్తూ ఒక పోస్ట్‌ పెట్టింది.

‘నా పేరుతో కొందరు కావాలని అసభ్యకరమైన కాంమెంట్స్‌తో ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. నాకు సంబంధం లేని విషయాలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో ఓపికగా వాటిని భరించాను. ఇకపై సహించేది లేదు. ఎవరైనా మీ లిమిట్స్‌ దాటి నాపై దుష్ప్రచారం చేస్తే లీగల్‌గా యాక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే నా ఫైనల్‌ వార్నింగ్‌’ అని పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌కి రెక్కలొచ్చి తెగ వైరల్‌ అయిపోతోంది. ఇప్పటికే ఆమెకు చాలా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ పోస్ట్‌ చూసిన తర్వాత ఆమెను సపోర్ట్‌ చేస్తూ వారు కామెంట్స్‌ పెడుతున్నారు. కొందరు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇకనైనా ఆ వ్యక్తులు మహిమపై చేస్తున్న ప్రచారాన్ని ఆపేస్తారో లేదో చూడాలి.