English | Telugu

యూరప్ లో నితిన్ హార్ట్ ఎటాక్

నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "హార్ట్ ఎటాక్". ఇటీవలే హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన ఈ చిత్ర యూనిట్, ఈ నెల 12 నుండి యూరప్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పూరి, నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి హిట్ సాధిస్తుందని యూనిట్ సభ్యులు పూర్తి నమ్మకంతో ఉన్నారు.