English | Telugu
రెండోసారి భయపెట్టనున్న ఛార్మి
Updated : Sep 10, 2013
ఛార్మి ప్రధాన పాత్రలో నటించి, మెప్పించిన చిత్రం "మంత్ర". ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఛార్మి "మంత్ర-2"గా మన ముందుకు రాబోతుంది. ఎస్వీ సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ "మంత్ర-2" చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్ లో జరుపుకున్నారు. ఈ చిత్రం గురించి ఛార్మి మాట్లాడుతూ... "మంత్ర" చిత్రం తర్వాత అలాంటి కొత్త రకం కథ ఇది. మంత్ర సినిమాకు ఎలాంటి పోలిక ఉండదు. ఈ సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకోని చేయనున్నానని అన్నారు. మరి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.