English | Telugu
"గబ్బర్ సింగ్" ఎంట్రీకి రంగం సిద్ధం
Updated : Sep 10, 2013
టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులు తిరగరాసిన ది వన్ అండ్ ఓన్లీ గబ్బర్ .. "గబ్బర్ సింగ్". ఇలాంటి మాస్ గబ్బర్ సింగ్ ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "గబ్బర్ సింగ్ -2" చిత్రం తెరకెక్కబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు సెప్టెంబర్ 20వ తేదీన ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇది "గబ్బర్ సింగ్" చిత్రానికి సీక్వెల్ కాదని ఇది వరకే దర్శకుడు సంపత్ నంది తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడైన శరత్ మరార్ నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది.