English | Telugu
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్!
Updated : Dec 29, 2023
శుక్రవారం వస్తోందంటే ఒకప్పుడు థియేటర్లవైపు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే ఈ మధ్య ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే ప్రతివారం వివిధ ఓటీటీ సంస్థలు పోటీలు పడి మరీ సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. ఓటీటీ అనగానే సినిమాలే కాదు, వెబ్ సిరీస్‌లు కూడా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. వాటిని కూడా ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఆ సినిమా ఏమిటో ఒకసారి చూద్దాం. తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక ఇక్కడ చాలా సినిమాలు చేసి ప్రస్తుతం చెన్నయ్‌లో సెటిల్ అయిపోయింది. తమిళ్‌లో లెక్కకు మించి సినిమాలు చేస్తోంది. తాజాగా ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే తెలుగులో సినిమాలో నటించింది. నవంబర్ 17న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో హన్సిక్ పెర్‌ఫార్మెన్స్ ఇరగదీసిందనే టాక్ వచ్చినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోందంటే.. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి అనే అమ్మాయి కొన్ని పరిస్థితుల కారణంగా మాఫియా వలలో చిక్కుకుంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి శృతి ఎలాంటి ప్లాన్స్ వేసింది, వారిని ఎలా దుర్కొందీ అనేది కథ. ఈ పాయింట్‌ను రెండున్నర గంటల పాటు ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసేలా దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు.