English | Telugu
నువ్వు దేవుడివి స్వామి.. బాలకృష్ణ పై ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కీలక వ్యాఖ్యలు
Updated : Nov 25, 2025
-బాలకృష్ణ లో దైవ శక్తి ఉందా!
-అఖండ 2 ఫీవర్ స్టార్ట్
-కుంభమేళా సన్నివేశాలు హై రేంజ్
-ప్రపంచ దేశాలు శివ శక్తిని చూస్తాయి
అభిమానులు, మూవీ లవర్స్ లో అఖండ 2(Akhanda 2)ఫీవర్ పీక్ లో ఉంది. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య చేసే శివతాండవం చూస్తామా అని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. చాలా మంది తమ రోజు వారి పనులు చేసుకుంటూనే బుక్ మై షో తో పాటు ఇతర యాప్ లని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి ఫీవర్ తాలూకు రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ట్రైలర్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. లెజండ్రీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్(Ram Lakshman)మాస్టర్స్ సదరు యాక్షన్స్ సీక్వెన్స్ ని పిక్చరైజ్ చేసారు.
అఖండ 2 ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఆ ఇద్దరు మాట్లాడుతు 'బాలకృష్ణ(Balakrishna)గారితో ఎప్పట్నుంచో పని చేస్తున్నాం. మా పనిలో ఏదో ప్రత్యేకత ఉంటుందని ఆయన నమ్మకం. అఖండ 2 ద్వారా అభిమానులని, ప్రేక్షకులని అలరించడానికి తొంబై తొమ్మిది శాతం యాక్షన్ సన్నివేశాలని రియల్ గా చేసారు. హిమాలయాల్లో చలికి తట్టుకోలేక అందరం కోట్లు వేసుకొని వెళితే బాలయ్య గారు మాత్రం తన క్యారక్టర్ కి తగ్గట్టుగా భుజాలు కనిపించే దుస్తులలోనే గంటల తరబడి యాక్షన్ సన్నివేశాలు చేసారు. క్యారక్టర్ లో అంతగా లీనమయ్యే నటుడు ఉండటం మనకి గర్వకారణం. అసలు ఆయన్ని సెట్ లో చూస్తుంటే దైవశక్తిని చూస్తున్నట్టుగా ఉండేది. కుంభమేళా నేపథ్యంలో సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రపంచ దేశాలు శివశక్తిలోని అద్భుతాన్ని చూసి గర్వపడేలా బోయపాటి శ్రీను(Boyapati Srinu)తీర్చిదిద్దాడని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చెప్పుకొచ్చారు.
also read: కాబోయే భార్య హరిణ్యరెడ్డి కి సర్ ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. ఒక సినిమా కోసం నూటికి నూరు శాతం బాలయ్య ఎంత కష్టపడతారో మరో సారి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాటల ద్వారా అర్థమవుతుందని జై బాలయ్య అంటూ సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినా ముందు రోజు నుంచే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ పడనున్నాయి.సంయుక్త మీనన్(Samyuktha Menon)హీరోయిన్ కాగా ఆది పినిశెట్టి(Aadhi Pinisetty)నెగిటివ్ షేడ్ లో మరో సారి మెస్మరైజ్ చేయనున్నాడు థమన్(Thaman)మ్యూజిక్ .