English | Telugu
పాన్ ఇండియా లెవెల్లో రికార్డు సృష్టించిన స్కంద
Updated : Nov 4, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌లుగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సెప్టెంబర్‌లోవిడుదలయిన సినిమా స్కంద. రామ్ సినీ కెరీర్‌లోనే భారీ స్థాయి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీ స్కంద ఇప్పుడు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
స్కంద మూవీ రీసెంట్ గా ఓటిటి లోకి ఆడుగు పెట్టింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోను డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదల అయిన స్కంద సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్కంద చిత్రం స్ట్రీమింగ్ అయిన మొదటి నలభై ఎనిమిది గంటలు పాటు క్లాక్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోని ప్రేక్షకులు మొదటి రెండు రోజులలోనే విపరీతంగా స్కంద సినిమాని చూసారు. ఇంతవరకు హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమా కి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇంత బజ్ దక్కలేదు. మొట్ట మొదటి సరిగా స్కంద మూవీ ఆ రికార్డు ని సాధించింది.
రామ్ పోతి నేని, బోయపాటి ల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన స్కంద మూవీ థియేటర్లలోనూ విజృంభించడంతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓటిటి లో కూడా విజృంభించడంతో రామ్ అభిమానులు, బోయపాటి అభిమానులు ఎంతో ఆనందంతో ఉన్నారు.చిత్ర యూనిట్ కూడా సంబరాలు చేసుకుంటుంది. అయితే కొంత మంది సోషల్ మీడియాలో బోయపాటి గత చిత్రాలకి సంబంధించిన సీన్స్ ని తీసుకొని స్కంద మూవీ సాధించిన పాన్ ఇండియా రికార్డు మీద ట్రోల్స్ చేస్తున్నారు