English | Telugu

మోహన్ బాబు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. మోహన్ బాబు వల్లే అది సాధ్యమైంది


చిరంజీవి లేటెస్ట్ స్పీచ్ వైరల్
ఈ నెల 21 న ఫ్యాన్స్ హంగామా
రామ్ చరణ్ కి ఈ మూవీ అంటే చాలా ఇష్టం
కొదమ సింహం మళ్ళీ మెప్పిస్తుందా!


మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)స్టార్ డమ్ ని మరింతగా ఎలివేట్ చేసిన చిత్రం 'కొదమసింహం'(Kodama Simham). 1990 అగస్ట్ 9 న రిలీజవ్వగా చిరంజీవి నుంచి వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ మూవీ. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ(Krishna)నుంచి 'మోసగాళ్లకి మోసగాడు' వంటి కౌబోయ్ చిత్రం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పైగా కౌబోయ్ గా కృష్ణ అందరి హృదయాల్లో ఒక రూపంగా నిలిచిపోయారు.

దీంతో అభిమానులతో పాటు సినీ లవర్స్ లో 'కొదమసింహం'పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అందరి అంచనాలకి తగ్గట్టే మూవీ మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి మేనరిజమ్స్, డాన్స్, సాంగ్స్, డైలాగ్స్ అభిమానులని ఉర్రుతలూగించాయి. సాంగ్స్ అయితే నేటికీ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తూ ఉన్నాయి.


ఇక ఈ చిత్రం ఈ నెల 21 న మరోమారు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టనుంది. దీంతో 35 ఏళ్ళ తర్వాత కొదమసింహాన్ని చూడటానికి అభిమానులు ప్రిపేర్ అవుతున్నారు. రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేసారు. సదరు వీడియోలో ఆయన మాట్లాడుతు కౌబాయ్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాల్లో నటిస్తానని ఎప్పుడు ఊహించలేదు. అప్పటికే కృష్ణ గారు చేసిన 'మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్ అవ్వడంతో పాటు అప్పట్లో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అటువంటి నేపథ్యంతో కూడిన సినిమాని మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. నిర్మాత, దర్శకుడి కోరిక ప్రకారమే చేశాను.

కౌబాయ్ సినిమాల్లో హీరోలు గడ్డం తీసేస్తారు. కానీ నేను గడ్డంతో కనపడతాను. ఆ విధంగా గడ్డం పెంచి నేను చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. మోహన్‌ బాబు చేసిన సుడిగాలి క్యారక్టర్ నాకు చాలా ఇష్టం. వినోదంగా ఉంటూనే చాలా జుగుబ్సగా అనిపించే సదరు క్యారక్టర్ లో చాలా బాగా నటించారు. మోహన్‌ బాబు తప్ప మరొకరు ఆ పాత్ర చేసి మెప్పించి ఒప్పించేవారు కాదు. అది ఆయన వల్లే సాధ్యమైంది. లెజెండరీ యాక్టర్‌ ప్రాణ్‌ విలన్ గా చేశారు. ఆ మహానుభావుడితో కలిసి యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది.


also read:నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే


రామ్ చరణ్‌(Ram Charan)కి ఈ మూవీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వాడు భోజనం చేయాలంటే వాళ్లమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ, భోజనం చేసేవాడు కాదు. చరణ్ కి అంతటి ఫేవరేట్ ఫిలిం. ఇప్పుడు రీ రిలీజ్ తో మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా అందరూ కొదమసింహని ఎంజాయ్ చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి సరసన సోనమ్, రాధ జంటగా నటించగా వాణి విశ్వనాధ్, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, రంగనాధ్, గొల్లపూడి మారుతీ రావు, జయంతి, అన్నపూర్ణ కీలక పాత్రలు పోషించారు. మురళి మోహన్ రావు(Murali MOhanrao)దర్శకుడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.