English | Telugu
రామ్ చరణ్ రికార్డుని ప్రభాస్ అందుకోగలడా!.. ప్రస్తుతానికి చరణ్ టాప్
Updated : Nov 24, 2025
-విన్నర్ ఎవరు!
-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామ
-ప్రభాస్, చరణ్ ఇద్దరు ఇద్దరే
-సాంగ్స్ తో ఫ్యాన్స్ లో ఎనర్జీ
అందరు అనుకున్నట్టుగానే 'పెద్ది'(Peddi)నుంచి వచ్చిన 'చికిరి'(Chikiri)సాంగ్ రికార్డు వ్యూస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రెహ్మాన్ మెస్మరైజ్ చేసే ట్యూన్ తో పాటు బాలాజీ సాహిత్యంలో వచ్చిన లిరిక్స్ పసివయసు వాళ్ళ నుంచి ముదుసలి వాళ్ళ వరకు పాడుకునేలా క్యాచీగా ఉండటంతో రికార్డులు తమంతట తావుగా 'పెద్ది'వద్దకు చేరుతున్నాయి. చిత్ర బృందం రీసెంట్ గా చికిరి సాంగ్ రికార్డు ని అధికారకంగా ప్రకటించింది.
పదహారు రోజుల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్ ని రాబట్టినట్టుగా వెల్లడించాయి. ఇప్పుడు ఈ రికార్డుతో మెగా అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సదరు రికార్డుల ప్రవాహానికి అంతులేదని, మరికొన్ని రికార్డులు చికిరి సాంగ్ సాదిస్తుందంటు సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ కూడా చేస్తున్నారు. ఇక పెద్ది రికార్డుతో ఇప్పుడు రాజా సాబ్(The Raja saab)గురించి కూడా చర్చ జరుగుతుంది.
Also read: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పదవిపై సుమన్ కీలక వ్యాఖ్యలు
రాజా సాబ్ నుంచి నిన్న రాత్రి 'రెబల్ సాబ్(Rebel Song)సాంగ్ అనే లిరిక్ తో కూడిన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సదరు సాంగ్ లో ప్రభాస్ లుక్ తో పాటు సాంగ్ సూపర్ గా ఉండటంతో పద్నాలుగు గంటల్లోనే తెలుగులో 10 మిలియన్ల వ్యూస్ కి అతికొద్ది దూరంలో ఉంది.. హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా సాంగ్ రిలీజ్ అవ్వగా , సదరు భాషల్లో కూడా రికార్డు వ్యూస్ ని రాబడుతుంది. దీంతో చికిరి రికార్డుని రెబల్ సాంగ్ బ్రేక్ చేస్తుందేమో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.