English | Telugu

సమంత పెదాల తడి తాకని చైతు

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఆటోనగర్ సూర్య". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో విడుదలైంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్లో, మ్యాక్స్ ఇండియా పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దేవాకట్టా దర్శకత్వం వహించాడు. ఈ వేడుకపై యాంకర్ ఝాన్సీ "ఏమాయ చేసావే"లో సమంతతో లిప్ లాక్ చేసారు కదా, మరి ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఉన్నాయా?" అని అడుగుతుంది. దానికి చైతు స్పందిస్తూ... "ముద్దుకు సమంత ఒప్పుకోలేదు." అని అనగానే.. వెంటనే సమంత.."దర్శకుడే వద్దు వద్దు అని చెప్పారు" అని అంది. వెంటనే పక్కన ఉన్న దర్శకుడు దేవాకట్టా స్పందిస్తూ.." నేను లిప్ లాక్ కావాలనే చెప్పాను" అని అన్నారు. ఇది విన్నవాల్లందరూ కూడా.."అంటే దర్శకుడు ఓకే అంటే లిప్ లాక్ పెట్టేస్తావా సమంత..." అంటూ, "సమంత ఒప్పుకుంటే ఆమెతో మరోసారి లిప్ లాక్ చేసే ఆలోచనలు బాగానే ఉన్నాయే నీకు.." అంటూ చైతు, సమంతలపై గుసగుసలు పెట్టారు.