English | Telugu

ఫిబ్రవరి 6న చెర్రీ సినిమా

కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ లోని రామానాయుడు సినీవిలేజ్ లో సెట్ వర్క్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇందులో చరణ్ అన్న పాత్రలో నటుడు శ్రీకాంత్ నటించనున్నాడు. చరణ్ కు జోడిగా మూడోసారి కాజల్ అగర్వాల్ జతకట్టనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.