English | Telugu
జూన్ 15 నుండి పవర్ స్టార్ చిత్రం
Updated : May 23, 2012
జూన్ 15 నుండి పవర్ స్టార్ చిత్రం ప్రారంభం కానుందట. వివరాల్లోకి వెళితే నేటి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ని తొలిసారిగా దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది. ఆయన హీరోగా నటించిన "బద్రి" చిత్రంతోనే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళిఇద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. ఆ చిత్రానికి "కెమెరామేన్ గంగతో రాంబాబు" అన్న పేరుని నిర్ణయించారు.
ఈ చిత్రం జూన్ 15 వ తేదీ నుండి ప్రారంభం కానుందట. ఈ చిత్రం కోసం ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, ఆలీ, తనికెళ్ళ భరణి, యమ్.యస్.నారాయణ, బ్రహ్మానందం ఇప్పటి వరకూ ఎన్నికైన తారాగణం. శ్యాం.కె.నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, యూనివర్సల్ మీడియా పతాకంపై, ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా