English | Telugu
తమిళంలో నటిస్తా - బాలయ్య
Updated : May 23, 2012
తమిళంలో నటిస్తానని బాలయ్య అన్నారట. వివరాల్లోకి వెళితే రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న "ఊ...కొడతారా...ఉలిక్కిపడతారా" చిత్రం తమిళ పోస్టర్ ని ఇటీవల చెన్నైలో విడుదల చేశారు. ఈ చిత్రానికి తమిళంలో "వరువాన్ తలైవర్" అన్న పేరుని నిర్ణయించారు. ఈ సందర్భంగా
ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో అతిథిగా నటించిన యువరత్న, నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ "నాన్నగారు మద్రాసు నీళ్ళు తాగి బ్రతుకుతున్నాం...కనుక ఈ మద్రాసుకి మనం రుణపడ్డామని అనే వారు. అలాగే నేను కూడా మద్రాసులోనే జన్మించాను. అవకాశమొస్తే తమిళ చిత్రాల్లో నటించటానికి నాకేమీ అభ్యంతరం లేదు" అని అన్నారు.