English | Telugu

జియాది హత్యా లేకా ఆత్మహత్యా - తేల్చనున్న సిబిఐ


తొలిచిత్రం నిశ్సబ్ద్ లో బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటించిన జియాఖాన్, హిందీ గజినీ చిత్రంలో కూడా నటించింది. చేసినవి తక్కువ చిత్రాలైనప్పటికీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె గత ఏడాది అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. హైకోర్టు విచారణలో వున్న ఆ కేసు ఇప్పుడు సిబీఐకి బదిలీ అయింది.


మృతురాలు జియాఖాన్ 2013, జూన్ 3న ముంబై, జుహూలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచాలణలో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు, జియాఖాన్ బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు.


అయితే జియాఖాన్ సూసైడ్ చేసుకోలేదని, ఇది హత్యేనని ఆమె తల్లి రబియా ఖాన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. సిబిఐచే విచారణ కొనసాగించాలని అభ్యర్థించారు. జియాఖాన్ మృతి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయూర్తులు విఎం కనడే, పిడి కోడేలు సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు.