English | Telugu

పెద్దిలో జాన్వీకపూర్ కి డూప్ ని పెట్టారా!.. బాంధవి శ్రీధర్ ఎవరు

పెద్ది పై భారీ అంచనాలు
జాన్వీ కపూర్ ఏం చేస్తుంది
బాంధవి శ్రీధర్ ఎవరు
తన కెరీర్ కి ప్లస్ అవుతుందా!

సిల్వర్ స్క్రీన్ పై పెద్ది(Peddi),అచ్చాయమ్మ లు అభిమానుల్ని, ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యబోతున్న విషయం కన్ఫార్మ్ అయిపోయింది. చికిరి చికిరి సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)పెద్దికి సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని చరణ్ ఈ సారి భారీ హిట్ ని అందుకోవడం ఖాయమనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి.

రీసెంట్ గా మరోన్యూస్ కూడా ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor)క్యారక్టర్ కి సంబంధించిన కొన్నిసన్నివేశాల్లో ప్రముఖ హీరోయిన్ 'బాంధవి శ్రీధర్' జాన్వీ కి డూప్‌గా కనిపించనుంది. ఇద్దరి హైట్ సమానంగా ఉండటంతో పాటు లుక్స్ దగ్గరగా ఉండటంతో మేకర్స్ బాంధవిని డూప్ గా సెలెక్ట్ చేసారు. జాన్వీ తరచు ముంబయి నుంచి లొకేషన్ కి రావాల్సి వస్తుంది. దీంతో ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ స్టే, మేకప్ టీమ్ వంటి వాటికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. అందుకే జాన్వీ కి డూప్ గా బాంధవిని తీసుకున్నారనే వార్తలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై పెద్ది యూనిట్ అధికారికంగా స్పందించలేదు. నిజం చెప్పాలంటే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భారీ నిర్మాణంతో తెరకెక్కే చాలా సినిమాల్లో ఫేస్ చూపించే అవసరం లేని కొన్ని షాట్స్ లో డూప్ ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాల్షీట్ సమస్యల సందర్భంలో కూడా ఆ విధంగా చేస్తారు.

also read:దర్శకుడు సంపత్ నంది ఇంట్లో తీవ్ర విషాదం

బాంధవి సినీ కెరీర్ ని చూసుకుంటే 'మసూద' మూవీలో దెయ్యం క్యారక్టర్ లో కనపడి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల్లో కనిపించినా పెద్దగా పేరు రాలేదు. అలాంటిది ‘పెద్ది’లో డూప్‌గా జాన్వీ ప్లేస్ లో చేస్తున్నది నిజమే అయితే ఆమె కెరీర్ కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మూవీలో చిన్న క్యారక్టర్ లో కూడా కనిపించనుందనే మరో టాక్ కూడా సర్క్యులేట్ అవుతుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న'పెద్ది'ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో ప్రతిభావంతులైన యాక్టర్స్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 26 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.